వినుకొండలో నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

వినుకొండలో నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

PLD: వినుకొండలో మంగళవారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ ఏడీఈ శ్రీనివాసరావు తెలిపారు. గుంటూరు నుంచి వచ్చిన ప్రొటెక్షన్ వింగ్ వినుకొండ టౌన్ ఎస్ఎస్-1, ఎస్ఎస్-3  పరిధిలో అత్యవసర మరమ్మతులు నిర్వహిస్తున్నందున ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఆయన పేర్కొన్నారు. ప్రజలు, విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.