బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికుల ధర్నా

బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికుల ధర్నా

PDPL: గోదావరిఖని బస్సు డిపో ముందు ఆర్టీసీ కార్మికులు CITU ఆధ్వర్యంలో ఇవాళ ధర్నా చేపట్టారు. ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీకి కేటాయించి, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌తో వారు ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి IFTU తమ మద్దతు ప్రకటించింది. ఆర్టీసీ సంస్థను, కార్మికుల ప్రయోజనాలను కాపాడాలని ఈ సందర్భంగా నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.