నూజివీడు కోర్టు నుంచి విజయవాడ సబ్ జైలుకు వంశీ

NTR: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఈ నెల 29 వరకు రిమాండ్ విధించడంతో శుక్రవారం విజయవాడకు తరలించారు. విజయవాడ సబ్ జైల్ నుంచి నూజివీడు కోర్టుకు వంశీని తీసుకురాగా, రిమాండ్ అనంతరం బందోబస్తు నడుమ ప్రత్యేక వాహనంలో విజయవాడకు తరలించారు. ఈ సందర్భంగా అనేకమంది అభిమానులు రావడంతో అందరినీ వల్లభనేని వంశీ పలకరించారు. కొందరు కంటతడి పెట్టుకోవడం కనిపించింది.