జిల్లాలో మెగా జాబ్ మేళా
BHPL: భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈనెల 28న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్టు జిల్లా ఉపాధి అధికారి ఆరూరి శ్యామల తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డిగ్రీ పూర్తిచేసిన నిరుద్యోగులు ఉదయం 10 గంటలలోపు జాబ్ మేళాకు హాజరుకావాలని ఆమె సూచించారు. జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.