భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య

BDK: భార్య పుట్టింటికి వెళ్లడంతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన మణుగూరులో చోటుచేసుకుంది. పట్టణంలోని శేషగిరినగర్‌కు చెందిన చిన్ని రామారావు(28) మద్యానికి బానిస కావడంతో తరచూ భార్యతో గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే భార్య పుట్టింటికి వెళ్లడంతో ఆదివారం రామారావు మనస్తాపానికి గురై ఇంట్లోనే ఉరేసుకున్నాడు.