భారత ఫుట్‌బాల్ దిగ్గజం కన్నుమూత
భారత ఫుట్‌బాల్ దిగ్గజం ఎస్‌హెచ్ హమీద్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. నిన్న హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. 1960 రోమ్ ఒలింపిక్స్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు తరఫున బరిలోకి దిగారు. విశ్వక్రీడల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించిన 14 మంది హైదరాబాద్ ప్లేయర్లలో ఒకరు. 1964 ఆసియాకప్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టులో హమీద్ సభ్యుడు కావడం విశేషం.