గీత కార్మికులకు రక్షక కవచాలు అందించిన మంత్రి

ములుగు జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవనంలో సోమవారం ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొని, పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కల్లు గీత కార్మికులకు 100 రక్షక కవచాలను అందించారు.