పద్మావతి అమ్మవారి సేవలో ఉన్నతాధికారులు
TPT: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని ఉన్నతాధికారులు దర్శించుకున్నారు. సీఎం కార్యాలయ కార్యదర్శి ప్రద్యుమ్న, జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్, కమిషనర్ మౌర్య సహా పలువురు ఉన్నతాధికారులు పద్మావతి అమ్మవారిను దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారికి స్వాగతం పలికి, అమ్మవారి ఆశీస్సులు, తీర్థప్రసాదాలను అందజేశారు.