గ్రామంలో నీటి సమస్యపై సర్పంచ్ శంకర్ కార్యాచరణ
WGL: పర్వతగిరి మండలకేంద్రంలోని నాల్గవ వార్డులో మంచి నీటి సమస్యను ఎదుర్కొంటున్న విషయం వార్డు సభ్యురాలు చిరుకొండ సులోచన వెంకన్న సర్పంచ్ చీదురు శంకర్ దృష్టికి తెచ్చారు. వెంటనే సర్పంచ్ శంకర్, పంచాయతీ కార్యదర్శి రఘుతో కలిసి మంగళవారం నాల్గవ వార్డులో పర్యటించి సమస్యలను పరిశీలించి పైపులైన్ లికేజీలకు మరమ్మతులు చేశారు.