మతిస్థిమితం లేక బావిలో పడి వృద్ధురాలు మృతి

మతిస్థిమితం లేక బావిలో పడి వృద్ధురాలు మృతి

GDWL: ఎర్రవల్లి మండలం వల్లూరు గ్రామంలో  విషాదం చోటుచేసుకుంది. ఎస్సై మురళీ కథనం మేరకు.. గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని తిరుపాలమ్మ(70) అనే వృద్ధురాలు ఊరి బావిలో పడి మృతి చెందింది. కుటుంబ సభ్యులు ఆమెను గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కొడుకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.