మృతులంతా తాండూరు, చేవెళ్ల వాసులే!

మృతులంతా తాండూరు, చేవెళ్ల వాసులే!

TG: ప్రమాదానికి గురైన TS 34 TA 6354 బస్సు ఉదయం 5 గంటలకు తాండూరు డిపో నుంచి బయలుదేరింది. ఈ బస్సును అద్దె ప్రాతిపదికన ఆర్టీసీ నడుపుతోంది. ప్రమాద సమయంలో బస్సులో 30 మందికిపైగా ఉద్యోగులు, విద్యార్థులు ఉన్నారు. మృతులంతా తాండూరు, చేవెళ్ల వాసులే. మృతులకు ఒకే చోట పోస్టుమార్టం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తున్నారు.