విజయవాడలో RTC బంపర్ ఆఫర్..!
NTR: విజయవాడ నగర ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు అర్ధరాత్రి వరకు చెల్లుబాటు అయ్యే ట్రావెల్ 'యాజ్ యూ లైక్' (TAYL) టికెట్ ఇకపై తీసుకున్న సమయం నుంచి 24 గంటల వరకు చెల్లుబాటు అవుతుంది. కేవలం రూ.100 చెల్లించి సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఎన్నిసార్లయినా ప్రయాణించవచ్చని జిల్లా ప్రజా రవాణా అధికారి దానం తెలిపారు.