గల్లంతైన మృతదేహం లభ్యం

గల్లంతైన మృతదేహం లభ్యం

NTR: విజయవాడ శివారులోని పోలవరం కాలువలో ఈనెల 21న కాలకృత్యాలకు వెళ్లి గల్లంతైన మధుసూదన్ మృతదేహం లభ్యమైంది. నున్న సీఐ కృష్ణమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం ఈలప్రోలు బుడమేరు వద్ద మృతదేహం దొరికింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.