'ఇంటి పన్నుల వసూలు వేగవంతం చేయాలి'
SKLM: ఇంటి పన్నుల వసూలు వేగవంతం చేయాలని సారవకోట ఎంపీడీవో మోహన్‌కుమార్ సూచించారు. మంగళవారం మండలంలోని కిన్నెరవాడ గ్రామంలో ఇంటి పన్నుల వసూలు, చెత్త సేకరణను పరిశీలించారు. అనంతరం సచివాలయంలో సిబ్బంది హాజరు, మూవ్‌మెంట్ రికార్డులను తనిఖీ చేశారు. గ్రామాల్లో ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండేలా సచివాలయ సేవలను మరింత మెరుగుపర్చుకోవాలని సూచించారు.