వరల్డ్ కప్ రన్స్.. మిథాలీ రికార్డ్ బ్రేక్
ఉమెన్స్ వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక రన్స్ చేసిన రెండో ప్లేయర్‌గా లారా వోల్వార్డ్(SA) అవతరించింది. 1368 పరుగులతో భారత్ మాజీ కెప్టెన్ మిథాలీ(1321)ని వెనక్కి నెట్టింది. ఓవరాల్‌గా ఈ లిస్టులో NZ మాజీ ప్లేయర్ డెబీ హక్లీ 1501 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ENG మాజీ ప్లేయర్లు జన్ బ్రిట్టిన్(1299), చార్లెట్ ఎడ్వర్డ్స్(1231) 3, 4 స్థానాల్లో ఉన్నారు.