నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

MNCL: కోటపల్లి మండలంలో బుధవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ADE బాలకృష్ణ తెలిపారు. నూతన పవర్ ట్రాన్స్‌ఫార్మర్ బిగించు పనులు చేపట్టనున్నందున మండలంలోని దేవులవాడ సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు నేడు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు. వినియోగదారులు అంతరాయానికి సహకరించాలని ADE సూచించారు.