మహా సన్నిధానం కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీ ఛైర్మన్
VZB: కొత్తవలస మండలం ఉత్తరాపల్లి గ్రామంలో అయ్యప్ప స్వామి మహా సన్నిధానంను గ్రామ సర్పంచ్, గ్రామ ప్రజలచే నిర్మాణం చేశారు. ఈ మహా సన్నిదానన్ని పార్టీ అధ్యక్షులు, జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎస్.కోట మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు చేతులమీదుగా బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కొత్తవలస జడ్పీటీసీ నెక్కల శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.