మానవ రూపంలో వినాయకుడు.. అరుదైన ఆలయం!

మానవ రూపంలో వినాయకుడు.. అరుదైన ఆలయం!

వినాయక చవితి సమీపిస్తున్న తరుణంలో తమిళనాడులోని తిలతర్పణపురిలో ఉన్న ఆది వినాయకర్ ఆలయం చర్చనీయాంశమైంది. ఈ ఆలయంలో గణనాథుడు ఏనుగు ముఖంతో కాకుండా మానవ రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఏనుగు తల అమర్చకముందు ఉన్న వినాయకుని అసలు రూపం ఇదేనని భక్తులు నమ్ముతారు. ఇక్కడ గణనాథుడిని పూజిస్తే ఆటంకాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు.