తాళ్లూరులో బాల్య వివాహాలపై అవగాహన

తాళ్లూరులో బాల్య వివాహాలపై అవగాహన

ప్రకాశం: తాళ్లూరులోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎస్సై ఆధ్వర్యంలో మంగళవారం బాల్యవివాహాలు, మత్తు పదార్థాలు వంటి విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతున్న సైబర్ మోసాలు, బ్యాంకు ఓటీపీ వంటి వాటిపై విద్యార్థులు జాగ్రత్త వహించాలని ఎస్సై పేర్కొన్నారు.