నేటికీ లభించని దంపతుల ఆచూకీ

TPT: రెండు నెలల క్రితం కనిపించకుండా పోయిన గిరిజన దంపతుల ఆచూకీ నేటికీ లభించలేదు. ఈ విషయమై గూడూరు డీఎస్పీ గీతా కుమారిని వివరణ కోరగా.. దర్యాప్తు చేస్తున్నామని, ఆచూకీ తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులకు తెలియజేస్తామన్నారు. ఈ మేరకు గూడూరు రెండో పట్టణం కోర్టు సెంటర్ వద్ద దుకాణంలో పని చేస్తున్న మునయ్య, రమణమ్మ రెండు నెలల నుంచి కనిపించకుండా పోయారు.