VIDEO: రైతును కన్నీరు పెట్టిస్తున్న టమాటా..!

VIDEO: రైతును కన్నీరు పెట్టిస్తున్న టమాటా..!

SDPT: టమాటా సాగు చేసిన రైతులకు ఈ సీజన్ కన్నీళ్లు మిగులుస్తోంది. నెల క్రితం రూ.40 పలికిన కిలో టమాటా ధర, ప్రస్తుతం రైతు బజార్‌లో రూ.8కి పడిపోయింది. అటు ధర లేక, ఇటు గిరాకీ లేక రైతులు విలవిలలాడుతున్నారు. కనీసం కోత కూలీలు కూడా రావడం లేదని గోవర్ధనగిరి రైతు బిక్షపతి ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.