మెస్సీ పర్యటన.. మూడంచెల భద్రత ఏర్పాటు

మెస్సీ పర్యటన.. మూడంచెల భద్రత ఏర్పాటు

TG: ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. కోల్‌కతాలో ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం వద్ద భారీగా బందోబస్తు పెంచారు. Z కేటగిరీ భద్రతతో పాటు ప్రత్యేక బలగాలు మోహరించాయి. 20 వాహనాల కాన్వాయ్‌లో మెస్సీ ఉప్పల్ స్టేడియానికి చేరుకోనున్నాడు. ఫలక్‌నుమా ప్యాలెస్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.