దుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు

NLG: చిట్యాలలోని కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంనికి ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు విచ్చేసి అమ్మవారికి క్షీరాభిషేకం చేశారు. అర్చకులు వేద ఆశీర్వచనం అందించి దంపతులను సత్కరించారు. ఆయనతో పాటుగా ఆలయ ఛైర్మన్ మారగోని ఆంజనేయులు గౌడ్, మాజీ ప్రజాప్రతినిధులు, డైరెక్టర్లు, భక్తులు పాల్గొన్నారు.