డెలివరీ బాయ్‌పై దాడి.. రూ. 27వేల దోపిడి
కృష్ణా: డెలివరీ బాయ్‌ను పిలిపించి, దాడి చేసి నగదు దోచుకున్న ఘటన యనమలకుదురులో కలకలం రేపింది. పెనమలూరు పోలీసుల వివరాల మేరకు.. డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న గోపాలకృష్ణకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి సుగాలికాలనీ వాటర్ ప్లాంట్ వద్దకు రావాలని సందేశం వచ్చింది. అక్కడికి చేరుకున్న అతడిని నిందితులు కృష్ణా నది వైపు తీసుకెళ్లారు. అతనిపై దాడి చేసి, రూ.27వేల దొచేశారు.