కలుషితమై రంగు మారిన తాగునీరు
NLR: చేజర్ల మండలం పుట్టుపల్లిలో తాగునీటి పైప్‌లైన్ లీకేజీతో నీరు కలుషితమైంది. రంగు మారిన నీటిని తాగలేక గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. వారం రోజులుగా బోరింగ్ నీటితోనే జీవనం సాగిస్తున్నామని తెలిపారు. ఈ సమస్యపై పలుమార్లు స్థానిక నాయకులకు, అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందన లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.