ఇంటి తాళం పగలగొట్టి బంగారం, నగదు చోరీ

ఇంటి తాళం పగలగొట్టి బంగారం, నగదు చోరీ

KNR: మొలంగూర్ గ్రామానికి చెందిన మరాటి రాజేశ్వరి కుటుంబం పెళ్లి కోసం జమ్మికుంటకు వెళ్లగా, గుర్తుతెలియని దుండగులు ఇంట్లో చొరబడ్డారు. గురువారం ఇంటికి వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉంది. బీరువాలోని తులం బంగారం, 50 తులాల వెండి ఆభరణాలు, రూ.30 వేల నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితురాలు వాపోయింది. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు