వాగులో ప్రమాదవశాత్తు జారిపడి వ్యక్తి మృతి

వాగులో ప్రమాదవశాత్తు జారిపడి వ్యక్తి మృతి

NGKL: జిల్లా ఉప్పునుంతల మండలం దాసర్లపల్లి గ్రామానికి చెందిన శంకర్ జి (45) శనివారం చిలుకల వాగులో ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందారు. ఇటీవల కురిసిన మొంథా తుఫాను కారణంగా వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. శంకర్  తన స్వగ్రామం నుంచి మామిళ్ళపల్లికి వెళ్లే క్రమంలో వాగు దాటుతుండగా ఈ విషాదం చోటు చేసుకుంది.