VIDEO: ఎరువుల షాప్‌ను తనిఖీ చేసిన కలెక్టర్

WGL: రాయపర్తి మండలంలోని ఎరువుల షాపును మంగళవారం జిల్లా కలెక్టర్ సత్య శారద తనిఖీ చేశారు. వర్షాకాలం పంటలకు రైతులకు సరిపడా విత్తనాలు, యూరియా ఉందా లేదా అని వ్యవసాయ శాఖ అధికారులను, వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా షాపులో రిజిస్టర్‌లను పరిశీలించారు. అదే విధంగా రైతులకు ఎరువులు విత్తనాలు నాణ్యతమైనవి అందించాలని, కాలం చెల్లిన మందుల విక్రయాలు జరగపవద్దని ఆమె తెలిపారు.