చినుకు పడితే రోడ్లు జలమయం
MHBD: చినుకు పడితే చాలు మోకాళ్ల లోతు నీరు నిలిచి నరకం కనిపిస్తోందని డోర్నకల్ మండలం ఎలమంచిలి తండా వాసులు బుధవారం ఆవేదన వ్యక్తం చేశారు. గత రాత్రి కురిసిన వర్షానికి సైడ్ కాలువలు లేక పోవడంతో నీరు రోడ్డు మీదకు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతానికి, ఇప్పటికీ ఏమాత్రం మార్పు లేదన్నారు. ఎలమంచిలి తండా-1 అంగన్వాడీ కేంద్రానికి వెళ్లే చిన్నారులకు పెద్ద సమస్యగా మారింది.