'వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలి'
MNCL: ఎరువులు, పురుగుమందులను వాడే సమయంలో రైతులు వ్యవసాయ అధికారుల సూచనలను పాటించాలని జన్నారం మండలంలోని కవ్వాల్ క్లస్టర్ ఏఈఓ అక్రమ్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. పలు గ్రామాలలో వర్షాలకు వరి పంట వంగిపోయిందన్నారు. రైతులు అధిక మోతాదులో ఆ పంటకు ఎరువులు వినియోగించడమే కారణమన్నారు. మోతాదుకు మించి పురుగు మందులు వినియోగిస్తే పంట ఎండిపోతుందని ఆయన వివరించారు.