అగ్నిప్రమాదంలో రూ.2.50 లక్షల సామాగ్రి దగ్ధం

అగ్నిప్రమాదంలో రూ.2.50 లక్షల సామాగ్రి దగ్ధం

MNCL: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గౌతమి నగర్‌లో డిప్యూటీ తాహసీల్దార్ శ్రీహరి ఇంటి భవనంపై పెంట్ హౌస్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో పెద్దఎత్తున మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో సుమారు 2.50 లక్షలు విలువ చేసే సామాగ్రి దగ్ధమైందని తెలిపారు.