వివేకా హత్య కేసు.. విచారణ వాయిదా

వివేకా హత్య కేసు.. విచారణ వాయిదా

AP: వివేకా హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. అయితే హత్యకు సంబంధించి తదుపరి దర్యాప్తు అవసరమా? లేదా? అని గతంలో సుప్రీంకోర్టు సీబీఐని అడిగింది. అఫిడవిట్ దాఖలు చేసేందుకు సీబీఐ సమయం కోరింది. సీబీఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కోర్టుకు హాజరయ్యారు. ఈ క్రమంలో విచారణను ఈనెల 16కు వాయిదా వేసింది.