VIDEO: 'వినాయక ఉత్సవ కమిటీలు నిబంధనలను అనుసరించాలి'

PPM: ఈనెల 27న జరిగే వినాయక చవితి సందర్భంగా ఉత్సవ కమిటీ వారికి పార్వతీపురం CI మురళీధర్ శుక్రవారం పలు సూచనలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉత్సవ కార్యక్రమాలు జరపొద్దని, పోలీసు వారికి సహకరించాలని కోరారు. విగ్రహ మండపాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఊరేగింపు, నిమజ్జన ప్రదేశం తదితర వివరాలను ముందస్తుగా సమర్పించాలన్నారు. కాగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలి అన్నారు