రైతులకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి: ఎమ్మెల్యే
KMM: వేంసూరు మండలంలో ప్రభుత్వం IKP ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి ప్రారంభించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే అధికారులు తగినంత జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే సూచించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు.