గంజాయి పట్టివేత.. ఏడుగురు అరెస్ట్

గంజాయి పట్టివేత.. ఏడుగురు అరెస్ట్

TG: HYD గోల్కొండ ఖిల్లా ప్రాంతంలో 308 ప్యాకెట్ల గంజాయి పట్టుబడింది. ఈ ఘటనలో పోలీసులకు 11 మంది నిందితులు ఉండగా.. ఏడుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి మొత్తం 2.03 కిలోల గంజాయి, బైకులు, 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. మత్తుపదార్థాలు, గంజాయిని విక్రయించినా, వినియోగించినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.