నట్లకొత్తూరు వీఆర్ఎ మృతి

నట్లకొత్తూరు వీఆర్ఎ మృతి

NDL: సంజామల మండల పరిధిలోని నట్లకొత్తూరు వీఆర్ఎగా విధులు నిర్వర్తిస్తున్న కట్టుబడి జయ లక్ష్మమ్మ(67) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కాగా, వీఆర్ఎ జయ లక్ష్మమ్మ మృతిపై తహసీల్దార్ అనిల్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్ తులసికృష్ణతో పాటుగా రెవెన్యూ సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.