సామెత.. దాని అర్థం

సామెత: ఆకలి రుచెరుగదు, నిద్ర సుఖమెరుగదు
అర్థం: బాగా ఆకలి వేసినప్పుడు తిన్న తిండి ఎలా ఉన్నా ఎంతో రుచిగా అనిపిస్తుంది. అలాగే బాగా అలసిపోయినప్పుడు మంచం, పరుపు, దిండు, ఫ్యాన్ మొదలైనవి లేకపోయినా కటికనేల మీద పడుకున్నా మంచిగా నిద్ర పడుతుంది అనే భావంతో ఈ సామెత వాడుతారు.