సోము వీర్రాజు వ్యాఖ్యలను ఖండించిన సీపీఐ
AP: భీమిలిలో కమ్యూనిస్టులపై BJP నేత సోము వీర్రాజు చేసిన అనుచిత వ్యాఖ్యలను CPI రాష్ట్ర నేత మరుపిళ్ల పైడిరాజు తీవ్రంగా ఖండించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలా మాట్లాడటం సరికాదన్నారు. ఉత్తరాంధ్రపై నిజమైన ప్రేమ ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని సవాల్ విసిరారు. ప్రజా సమస్యలపై స్పష్టమైన వైఖరి చెప్పకుండా ఇతరులను విమర్శించడం మానుకోవాలని హితవు పలికారు.