పత్తి రేట్లు తగ్గుముఖం.. ఆవేదనలో రైతులు
KRNL: ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో నిన్న పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ప్రకటించారు. పత్తి క్వింటాకు రూ. 3,960 నుంచి రూ. 7,431, వేరుశనగకు రూ. 4,499 నుంచి రూ. 6,889, ఆముదాలకు రూ. 5,293 నుంచి రూ. 5,868 వరకు నమోదయ్యాయి. తేమ శాతం కారణంగా సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పంటలను కొనడంలేదని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.