నరసరావుపేటలో వ్యవసాయ శాఖ విజిలెన్స్ దాడులు
PLD: నరసరావుపేట పట్టణంలోని పలు ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయాలలో మంగళవారం వ్యవసాయ శాఖ విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో నిషేధిత ఆరు రకాల బయో ఉత్పత్తులు 188 లీటర్లు స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ అధికారి సి.హెచ్. ఆదినారాయణ తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఈ ఉత్పత్తుల విలువ రూ. 12.28 లక్షలు ఉంటుందని ఆయన వెల్లడించారు.