బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా పోతుగంటి భరత్ ప్రసాద్

NGKL: బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా మాజీ జడ్పీటీసీ పోతుగంటి భరత్ ప్రసాద్ నియమితులయ్యారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.