3 గ్రామాలకు ఓకే పోస్ట్ మాస్టర్.. ఇబ్బందులు పడుతున్న వృద్ధులు

3 గ్రామాలకు ఓకే పోస్ట్ మాస్టర్.. ఇబ్బందులు పడుతున్న వృద్ధులు

MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురంలో పోస్ట్ఆఫీస్ వద్ద పెన్షన్ల కోసం వృద్ధులు క్యూలైన్‌లో నిల్చొని బారులు తీరారు. అమ్మాపురం పోస్ట్ మాస్టర్ ఖానాపురం, జీకే తండా గ్రామాలలో పెన్షన్లు పంపిణీ చేసి గ్రామానికి రావడానికి చాలా సమయం పడుతుంది. దీంతో ప్రతి నెల పెన్షన్లు తీసుకోవడానికి అమ్మపూరం వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కారించాలని కోరారు.