లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
వనపర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన 796 మంది లబ్ధిదారులకు మంజూరు అయిన సుమారు 3 కోట్ల 48 లక్షల విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే మేఘారెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. బుధవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు భరోసాగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుంది అన్నారు.