VIDEO: 'వనపర్తి ఆర్టీసీ డిపోకు రూ.11.50 లక్షల ఆదాయం'
WNP: కురుమూర్తి జాతర సందర్భంగా వనపర్తి డిపోకు దాదాపు రూ.11.50 లక్షల ఆదాయం సమకూరిందని డీఎం దేవేందర్ గౌడ్ తెలిపారు. అక్టోబర్ 27, 28 తేదీలలో జాతరకు వనపర్తి, కొత్తకోట నుంచి 22 బస్సులు నడిపినట్లు తెలిపారు. మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన గత సంవత్సరం జాతర సందర్భంగా డిపోకు సమకూరిన ఆదాయం కంటే ఈ సంవత్సరం లక్ష రూపాయలు అధికంగా వచ్చిందన్నారు.