మద్యం మత్తులో వ్యక్తి హల్‌చల్
నంద్యాల: మద్యం మత్తులో ఓ వ్యక్తి హల్‌చల్ చేసిన ఘటన కోవెలకుంట్లలో జరిగింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మద్యం మత్తులో నిన్న రాత్రి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కి వీరంగం సృష్టించాడు. దీంతో చుట్టుపక్కల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అనంతరం స్థానికులు విద్యుత్ సరఫరాను నిలిపివేయించి, అతడిని కిందకు దింపారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.