నేటి నుంచి మిర్చియార్డుకు దసరా సెలవులు
గుంటూరు మిర్చియార్డులో దసరా పండుగ సందర్భంగా సెలవులు ప్రకటించారు. దుర్గాష్టమి, గాంధీ జయంతి, విజయ దశమి కార్మిక సంఘాల అభ్యర్థన మేరకు అధికారులు ఈ సెలవులు ప్రకటించారు. దీంతో నేటి నుంచి ఈనెల 2 వరకు క్రయవిక్రయాలు జరగవు. కేవలం శుక్రవారం మాత్రమే మిర్చి అమ్మకాలు జరుగుతాయి. రైతులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు తెలిపారు.