బాధిత కుటుంబాన్ని పరామర్శించిన MLA

అనంతపురం: జిల్లాలోని నారాయణపురం పంచాయతీకి చెందిన నర్సింహులు 2 నెలల క్రితం ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొని మృతి చెందాడు. నరసింహులు 2 నెలల క్రితమే టీడీపీ సభ్యత్వ నమోదు రెన్యువల్ చేసుకున్నారు. దీంతో విషయం తెలుసుకున్న అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ బాధిత కుటుంబానికి ఇన్సూరెన్స్ వచ్చేలా చొరవ తీసుకున్నారు.