కేజీబీవీ పాఠశాలలో బాల్యవివాహాలపై అవగాహన

కేజీబీవీ పాఠశాలలో బాల్యవివాహాలపై అవగాహన

సత్యసాయి: సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగం ప్రొటెక్షన్ ఆఫీసర్ నాగలక్ష్మి, ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీవో శాంతలక్ష్మి మాట్లాడుతూ.. బాల్య వివాహాల వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, ఆర్థిక నష్టాలను వివరించారు. వాటిని నిర్మూలిస్తేనే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమని తెలిపారు.