'ఆర్టీసీ బస్టాండ్‌లో కంట్రోలర్‌ను నియమించాలి'

MNCL: జన్నారం బస్టాండులో ప్రయాణికుల సౌకర్యార్థం అధికారులు కంట్రోలర్‌ను నియమించాలని సీపీఎం పార్టీ మండల కార్యదర్శి కనికరపు అశోక్ కోరారు. బస్టాండ్‌లో గతంలో రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగిని కంట్రోలర్‌గా నియమించి తీసివేశారన్నారు. దీంతో ప్రయాణికులకు బస్సుల సమయాలు తెలియడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బస్టాండ్‌లో కంట్రోలర్‌ను నియమించాలని కోరారు.