పామాయిల్ సాగుకు రైతులు ముందుకు రావాలి: చిన్నారెడ్డి

పామాయిల్ సాగుకు రైతులు ముందుకు రావాలి: చిన్నారెడ్డి

WNP: రైతులందరూ పంట మార్పిడి విధానాన్ని అవలంబించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. కృత్రిమ ఎరువులు అత్యధికంగా వాడకుండా సేంద్రియ ఎరువులను ఉపయోగించి వ్యవసాయం చేయాలన్నారు. ప్రస్తుతం పామాయిల్‌కు మంచి డిమాండ్ ఉందని, రైతులు ఈ పంట వేయడానికి ముందుకు రావాలన్నారు. పామాయిల్ పంట వేసే వారికి ప్రభుత్వం మంచి ప్రోత్సాహకం అందిస్తుందన్నారు.